తెలంగాణ

telangana

ETV Bharat / state

పట్టణ ప్రగతి కార్యక్రమంలో మొక్కలు నాటిన కలెక్టర్​

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలోని పట్టణ ప్రగతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్​ రవి పాల్గొని అధికారులకు దిశానిర్దేశం చేశారు. 20వ వార్డులో మొక్కలు నాటారు.

By

Published : Feb 26, 2020, 12:15 PM IST

collector pattana pragathi  program in jagityala
పట్టణ ప్రగతి కార్యక్రమంలో మొక్కలు నాటిన కలెక్టర్​

జగిత్యాల జిల్లా మెట్​పల్లి పురపాలక పరిధిలో రెండోరోజు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని అధికారులు అట్టహాసంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రవి పాల్గొని అధికారులకు పలు సూచనలు చేశారు. పట్టణంలోని 20వ వార్డులో పలు రకాల మొక్కలు నాటారు. పట్టణ పరిశుభ్రతకు ప్రతి ఒక్కరు పాటుపడాలని.. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్​ సూచించారు.

ఇంటికి రెండు మొక్కలి చొప్పున పెంచాలని.. తమ తమ కాలనీలను పచ్చదనంతో తీర్చిదిద్దుకోవాలని ప్రజలకు సూచించారు. పదిరోజుల్లో పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేలా చర్యలు చేపడుతున్నామని జిల్లా పాలనాధికారి తెలిపారు.

పట్టణ ప్రగతి కార్యక్రమంలో మొక్కలు నాటిన కలెక్టర్​

ఇదీ చూడండి :'మేడారం జాతరలో ఆర్టీసీ పాత్ర ఎంతో కీలకం'

ABOUT THE AUTHOR

...view details