తెలంగాణ

telangana

ETV Bharat / state

కూరగాయాల మార్కెట్​ను తనిఖీ చేసిన కలెక్టర్, ఎమ్మెల్యే - collector inspection at jagityal vegetable market

జగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్​, ఎమ్మెల్యే సంజయ్​కుమార్​ కలిసి జగిత్యాల కూరగాయల మార్కెట్​ను పరిశీలించారు. పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.

కూరగాయాల మార్కెట్​ను తనిఖీ చేసిన కలెక్టర్, ఎమ్మెల్యే

By

Published : Nov 21, 2019, 11:22 AM IST

జగిత్యాల కూరగాయల మార్కెట్​ను జగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్, ఎమ్మెల్యే సంజయ్​కుమార్ పరిశీలిచారు. మార్కెట్​లో సమస్యలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. మార్కెట్​లో పారిశుద్ధ్యం మెరుగుపరచాలని, ప్లాస్టిక్ కవర్లు నిషేధించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.

మార్కెట్​లో పారిశుద్ధ్యం లోపించినందున మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరుగుకాలువలు అపరిశుభ్రంగా ఉండటం చూసి దగ్గరుండి వాటిని శుభ్రం చేయించారు. నిర్మాణంలో ఉన్న షెడ్డును త్వరగా పూర్తి చేయాలన్నారు.

కూరగాయాల మార్కెట్​ను తనిఖీ చేసిన కలెక్టర్, ఎమ్మెల్యే

ఇవి కూడా చదవండి:భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్​ బోబ్డే ప్రమాణం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details