జగిత్యాల జిల్లాలోని అన్ని గ్రామాల్లో పారిశుద్ధ్యం కోసం చర్యలు చేపట్టాలని కలెక్టర్ మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేయాలని అన్నారు. స్థానిక దేవిశ్రీ గార్డెన్లో పంచాయతీ కార్యదర్శులు, మండల, జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలకు శుద్ధ తాగునీరు అందేలా చూడాలని తెలిపారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని సూచించారు. ఇందులో ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలని పేర్కొన్నారు.
జగిత్యాలలో జిల్లా స్థాయి అధికారులతో కలెక్టర్ సమీక్ష - జగిత్యాలలో హరితహారంపై కలెక్టర్ సమీక్ష
హరిత హారం, పారిశుద్ధ్యం వంటి అంశాలపై జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు జగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్. మొక్కలు నాటడంలో ప్రజలు భాగస్వాములయ్యేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.
కలెక్టర్ సమీక్ష