తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రైవేట్‌ ఉద్యోగులకు పూర్తి స్థాయి వేతనం చెల్లించాలి' - JAGITIAL COLLECTOR GUGULOTH RAVI

లాక్​డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రైవేట్ ఉద్యోగులకు పూర్తి స్థాయి వేతనం చెల్లించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ గుగులోతు రవి ఆదేశించారు. ఎవరికీ యాజమాన్యాలు వేతనాలు ఇవ్వకపోయినా కలెక్టరేట్​కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.

JAGITIAL COLLECTOR GUGULOTH RAVI
'ప్రైవేట్‌ ఉద్యోగులకు పూర్తి స్థాయి వేతనం చెల్లించాలి'

By

Published : Apr 29, 2020, 9:36 PM IST

కరోనా వైరస్‌ కట్టడిలోభాగంగా లౌక్‌డౌన్‌తో నిలిచిపోయిన ప్రైవేట్‌ సంస్థల్లో పని చేసే ఉద్యోగులకు పూర్తి స్థాయి వేతనం చెల్లించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్‌ గుగులోతు రవి ఆదేశించారు. జగిత్యాలలో ప్రైవేటు సంస్థల యాజమాన్యాలు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వేతనాలు పూర్తి స్థాయిలో ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

విద్య, దుకాణాలు, రైస్‌మిల్లలు, మెడికల్‌ ఎజన్సీలు, డిగ్రీ, జూనియర్‌ కళాశాలలు, వివిధ ప్రైవేట్‌ సంస్థల్లో పని చేసే వారు, గుమాస్తాలు, డ్రైవర్లు, ప్రైవేట్‌ ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించాలన్నారు. వేతనాలు రాని ఎడల కలెక్టరేట్​లో ఏర్పాటుచేసిన టోల్ ఫ్రీ నెంబర్ 1800-4257-620 లేదా 08724 - 222204కు ఫోను చేయవచ్చని సూచించారు. యాజమాన్యం పూర్తి వేతనం ఇవ్వకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రవి హెచ్చరించారు.

కొన్నింటికి వెసులుబాటు...

ప్రభుత్వము కొన్నింటికి వెసులుబాటు కల్పించిందని కలెక్టర్‌ రవి పేర్కొన్నారు. క్రషర్లు, ఇటుకల తయారీ, రూరల్ పరిధిలో రిపేర్ షాపులు, బీడీల తయారీ, సానిటరీ టైల్స్, రూప్ టైల్స్, సిమెంట్ ఫ్యాక్టరీ, జిన్నింగ్ మిల్స్, ఐరన్, స్టీల్ ఇండస్ట్రీస్, ప్లాస్టిక్, సానిటరీ పైపులు, పేపర్ ఇండస్ట్రీస్, ప్లాస్టిక్, రబ్బర్ ఇండస్ట్రీస్లతు వెసులు బాటు ఉందన్నారు. అయితే ఇందులో పనిచేసే ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించాలని, వ్యక్తిగత దూరం పాటించాలని కలెక్టర్‌ రవి ఆదేశాలు జారీ చేశారు.

ఇవీ చూడండి:సాదాసీదాగా తెజస వార్షికోత్సవం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details