అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సామాజిక సమరసతా వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పల ప్రసాద్ అన్నారు. ఆలయానికి సేకరిస్తున్న విరాళాల కార్యక్రమాన్ని జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలోని కళానగర్ శ్రీశ్రీ ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు.
ఇంటింటికి తిరుగుతూ అయోధ్య విశిష్టతను వివరిస్తూ విరాళాలు సేకరించారు. 2023లో రామమందిర నిర్మాణం జరగబోతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలని కోరారు.