జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం వెంపేట గ్రామంలో రామ మందిర నిర్మాణ నిధి విరాళాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక రామాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి.. గ్రామంలోని మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ రామ భజన చేస్తూ.. ఇంటింటా తిరిగి నిధిని సేకరించారు.
భజనలు, కీర్తనలతో రామాలయ నిర్మాణానికి విరాళాలు - తెలంగాణ వార్తలు
జగిత్యాల జిల్లాలో అయోధ్య రామ మందిర నిర్మాణ నిధి సమర్పణ కార్యక్రమం మెదలయింది. భక్తులు రాముని భజనలతో ప్రతి ఇల్లు తిరిగి నిధులు సేకరించారు. భక్తి శ్రద్ధలతో ప్రజలు కూడా తమకు తోచినంత విరాళం ఇస్తున్నారు.
భజనలు కీర్తనలతో రామ మందిర నిర్మాణ విరాళాల సేకరణ
అయోధ్య రామ మందిర కళ నేరవేరుతున్న తరుణంలో ప్రతీ ఒక్కరు నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని.. ఉడతా భక్తిగా అందరూ తోచినంత విరాళం ఇవ్వాలని కోరారు.
ఇదీ చూడండి:పెట్రో ధరలపై మోదీకి రాహుల్ పంచ్