జగిత్యాల జిల్లాలోని మంచినీళ్ల బావి సమీపంలో కొబ్బరికాయలను ఉపయోగించి వినాయకుడిని తయారు చేశారు. 600 కొబ్బరి కాయలతో, నాలుగు రోజులపాటు శ్రమించి తయారుచేసిన ఈ బొజ్జ గణపయ్య స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. అన్ని శుభ కార్యాలకు ఉపయోగించే కొబ్బరికాయతో వినాయకుడిని తయారు చేయాలనే ఆలోచనతో దీనిని తయారు చేసినట్లు యువకులు తెలిపారు. ఈ గణనాథుని చూసేందుకు స్థానికులు ఉత్సాహం చూపిస్తున్నారు.
కోకోనట్ గణేశ్... ఈ వినాయకుడు ఎంతో ప్రత్యేకం! - జగిత్యాల
జగిత్యాల జిల్లాలో కొబ్బరికాయలను ఉపయోగించి తయారు చేసిన బొజ్జ గణపయ్య ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు.
జగిత్యాలలో ఆకట్టుకుంటున్న కొబ్బరి గణపతి..