తెలంగాణ

telangana

ETV Bharat / state

మెట్​పల్లిలో లయన్స్​ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ! - మెట్​పల్లి

పర్యావరణాన్ని కాపాడాలని ప్రచారం చేస్తూ జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో లయన్స్​ క్లబ్​ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలు పంపిణీ చేశారు. గత పది సంవత్సరాలుగా జిల్లాలో మట్టి విగ్రహాలు పంచుతున్నట్టు లయన్స్​ క్లబ్​ సభ్యులు తెలిపారు. పండుగ పేరుతో పర్యావరణాన్ని పాడు చేయవద్దని వారు కోరారు.

Clay Ganesh Idols Distributed by lions club in metpally
మెట్​పల్లిలో లయన్స్​ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ!

By

Published : Aug 22, 2020, 2:16 PM IST

వినాయక చవితి సందర్భంగా జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో లయన్స్​ క్లబ్​ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలు పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతీ ఒక్కరు మట్టి విగ్రహాలనే పూజించాలని, చెరువులు, ప్రకృతిని కాపాడుకోవడం మన బాధ్యత అని లయన్స్​ క్లబ్​ సభ్యులు ప్రజలకు అవగాహన కల్పించారు.

మెట్​పల్లిలో లయన్స్​ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ!

గత పది సంవత్సరాలుగా లయన్స్​ క్లబ్​ నుంచి మట్టి విగ్రహాలు పంచుతున్నట్టు వారు తెలిపారు. ప్రతి ఏటా మెట్​పల్లి పట్టణ కేంద్రంలో దాదాపు 2వేల విగ్రహాలను పంచుతున్నట్టు వివరించారు.

ఇవీచూడండి:ఆ గంటలో ఏం జరిగింది ? ప్రమాదం ఎందుకు సంభవించింది ?

ABOUT THE AUTHOR

...view details