జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం కోనాపూర్ గ్రామాన్ని సందర్శించారు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. చొప్పదండి నియోజకవర్గం నుంచి విదేశాలకు వలస వెళ్లి తిరిగొచ్చిన వారి ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు. శుభకార్యాలకు స్వగ్రామానికి తిరిగి వస్తున్న వలసదారులు ఆందోళనకు గురికాకుండా వైద్య పరీక్షలు తప్పకుండా పూర్తి చేసుకోవాలన్నారు.
నిర్లక్ష్యం వద్దు.. అప్రమత్తంగా ఉండండి: సుంకె రవిశంకర్ - latest news on choppadandi mla sunke ravi shanker
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు అంతా అప్రమత్తంగా ఉండాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. వలస వెళ్లొచ్చిన వారు తప్పక వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు.
![నిర్లక్ష్యం వద్దు.. అప్రమత్తంగా ఉండండి: సుంకె రవిశంకర్ choppadandi mla sunke ravi shanker toured in konapur jagtial district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6482992-515-6482992-1584713282044.jpg)
నిర్లక్ష్యం వద్దు.. అప్రమత్తంగా ఉండండి: సుంకె రవిశంకర్
స్థానికంగా నివాసం ఉండే వారంతా చేతులు శుభ్రంగా ఉంచుకొని ఆరోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. మన ప్రాంతంలో ఎవరికీ కరోనా వైరస్ రాలేదని నిర్లక్ష్య ధోరణి వీడి అంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరచాలనానికి దూరంగా ఉండి నమస్కరించాలని సూచించారు.
నిర్లక్ష్యం వద్దు.. అప్రమత్తంగా ఉండండి: సుంకె రవిశంకర్
ఇదీ చూడండి: 'కరోనాపై యుద్ధం కోసం.. వచ్చే ఆదివారం జనతా కర్ఫ్యూ'