జగిత్యాల వాణినగర్‌లో పట్టపగలే గొలుసు దొంగలు విజృంభించారు. ద్విచక్రవాహనంపై వచ్చి మహిళ మెడలో నుంచి గొలుసు లాక్కెళ్లేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా గొలుసు లాగడంతో మహిళ కింద పడిపోయింది. తలకు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. జగిత్యాలలో ఇలాంటి ఘటనలు గతంలో ఎప్పుడూ జరగలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు.. స్నాచర్ల కోసం గాలిస్తున్నారు.
పట్టపగలే చైన్ స్నాచింగ్‌కు విఫల యత్నం - JAGITIAL
పండగ రోజు పట్టపగలే చైన్ స్నాచింగ్ కు విఫలయత్నం జరిగింది. నడుస్తూ వెళ్తున్న మహిళ మెడలోంచి బంగారు గొలుసు లాక్కెళ్లేందుకు ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ప్రయత్నించారు.

పట్టపగలే చైన్ స్నాచింగ్‌కు విఫల యత్నం
Last Updated : Apr 6, 2019, 8:20 PM IST