తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యుదాఘాతంతో బాలుడు మృతి - విద్యుదాఘాతంతో బాలుడు మృతి

భవనంపై ఆడుకుంటున్న బాలునికి కరెంట్​ షాక్​ తగిలి మృతి చెందిన విషాద ఘటన జగిత్యాలలోని కృష్ణానగర్​లో చోటుచేసుకుంది.

విద్యుదాఘాతంతో బాలుడు మృతి

By

Published : Oct 12, 2019, 11:48 PM IST

జగిత్యాల కృష్ణానగర్​లో భవనంపై ఆడుకుంటున్న ఓ బాలుడు కరెంటు షాక్ తగిలి మృతిచెందాడు. సాత్విక్ అనే మూడో తరగతి విద్యార్థి ఆడుకునేందుకు భవనం పైకి వెళ్లగా... ఇనుప తీగకు విద్యుత్ సరఫరా కావడం వల్ల దానికి తగిలి అక్కడే పడిపోయాడు. తల్లి గమనించి ఆ బాలున్ని ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. అల్లారుముద్దుగా చూసుకున్న కన్న కొడుకు విగతజీవిగా పడి ఉండడం చూసి తల్లి బోరున విలపించింది.. ఈ ఘటనపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

విద్యుదాఘాతంతో బాలుడు మృతి

ABOUT THE AUTHOR

...view details