జగిత్యాలలో మహిళలు గంగమ్మ తల్లికి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు. పట్టణంలోని వాణినగర్, బీట్‌బజార్, పురాణిపేటకు చెందిన గంగపుత్ర మహిళలు బోనాలతో ఆలయానికి తరలివెళ్లారు. యువతి, యువకుల నృత్యాలు, పోతురాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పిల్లాపాపలు చల్లగా ఉండాలని గంగమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు.
గంగమ్మా..వానలు కురిపించు తల్లీ..! - Bonalu
జగిత్యాలలో బోనాల పండుగ ఘనంగా జరిగింది. వర్షాలు కురవాలని కోరుతూ గంగమ్మ తల్లిని వేడుకున్నారు. యువతి, యువకుల సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి.
గంగమ్మా..వానలు కురిపించు తల్లీ..!