తెలంగాణ

telangana

ETV Bharat / state

'దుబ్బాకతో మార్పు... వచ్చే సార్వత్రికంలో భాజపాదే గెలుపు' - telangana bjp updates

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జగిత్యాల జిల్లాలో పర్యటించారు. పలు గ్రామాల్లో పర్యటించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. వచ్చే ఎన్నికల్లో భాజపా గెలుపొంది ప్రభంజనం సృష్టిస్తుందన్నారు.

దుబ్బాకతో మార్పు... వచ్చే సార్వత్రికంలో భాజపా గెలుపు: బండి సంజయ్
దుబ్బాకతో మార్పు... వచ్చే సార్వత్రికంలో భాజపా గెలుపు: బండి సంజయ్

By

Published : Jan 15, 2021, 10:24 PM IST

దుబ్బాక తీర్పుతో ఫలితాలు మారుతున్నాయని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భాజపా గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలో ఆయన పర్యటన సాగింది. మేడిపల్లి, కొండాపూర్‌, వెంకట్రావ్‌పేట, కాసారం, కమ్మరిపేట, భీమారం, దేశాయిపేట, గోవిందారం, లింగంపేట, మన్నెగూడెం, దమ్మన్నపేట, వల్లంపల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

భాజపా కార్యకర్తలు ఆయనకు గ్రామాల్లో ఘన స్వాగతం పలికారు. వచ్చే ఎన్నికల్లో భాజపా గెలుపొంది ప్రభంజనం సృష్టిస్తుందన్నారు. ప్రజలు భాజపా వైపు చూస్తున్నారని బండి సంజయ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయనతో పాటు భాజపా జిల్లా అధ్యక్షుడు మోరపల్లి సత్యనారాయణరావు పాల్గొన్నారు.

ఇదీ చూడండి :రాష్ట్ర వ్యాప్తంగా రేపు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details