రైతుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భాజపా ఆందోళనకు దిగింది. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని మెట్పల్లిలో భాజపా నాయకులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. కార్యాలయం ముందు బైఠాయించి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. సన్న ధాన్యానికి క్వింటాకి రూ.2500 మద్దతు ధర ఇవ్వాలంటూ నాయకులు డిమాండ్ చేశారు. సుమారు అరగంట పాటు ధర్నా నిర్వహించారు.
'రైతు సమస్యలు వెంటనే పరిష్కరించాలి... లేదంటే ఉద్ధృతం చేస్తాం' - jagtial district news
జగిత్యాల జిల్లా మెట్పల్లిలో భాజపా నాయకులు ఆందోళన చేపట్టారు. రైతు సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సన్నధాన్యానికి మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
'రైతు సమస్యలు వెంటనే పరిష్కరించాలి... లేదంటే ఉద్ధృతం చేస్తాం'
ఆందోళన అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. రైతు సమస్యలు పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:'విరుష్క' వివాహ బంధానికి మూడేళ్లు.. జంట భావోద్వేగం