జగిత్యాల జిల్లా మెట్పల్లి, కోరుట్ల, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల్లో భాజపా నాయకులు రైతు గోస దీక్ష చేపట్టారు. కరోనా నేపథ్యంలో ఇళ్లలో ఉండి ప్లకార్డులను ప్రదర్శించారు. మార్కెట్ యార్డుకు ధాన్యం తీసుకొచ్చి రోజులు గడుస్తున్నా ఇంకా కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో అన్నదాతలు నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులను ఆదుకోవాలని భాజపా ఆందోళన - తెలంగాణ వార్తలు
జగిత్యాల జిల్లాలోని పలు మండలాల్లో భాజపా నేతలు ధర్నా చేపట్టారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
భాజపా నేతలు ధర్నా, రైతుల కోసం భాజపా ధర్నా
వెంటనే ధాన్యం కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు. తాలు పేరిట క్వింటాకు ఆరు కిలోల వరకు కోత విధిస్తున్నారని వాపోయారు. ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని కోరారు. లేనిపక్షంలో భాజపా ఆధ్వర్యంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామన్నారు.