తెరాస ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ నాయకులు జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి శాంతియుత నిరసన చేపట్టారు. రాష్ట్రంలో తెరాస సర్కారు ఒంటెద్దు పోకడ పోతుందని విమర్శించారు. అనవసరంగా భారతీయ జనతా పార్టీపై బురదజల్లితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
'భాజపాపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదు' - మెట్పల్లిలో భాజపా శాంతియుతన ఆందోళన
భాజపాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెరాస నాయకుల తీరును వ్యతిరేకిస్తూ జగిత్యాల జిల్లా మెట్పల్లిలో భాజపా కార్యకర్తలు శాంతియుత ఆందోళన చేపట్టారు.
!['భాజపాపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదు' bjp-leaders-protest-at-metpally-in-jagtial-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9399853-1079-9399853-1604307245507.jpg)
'భాజపాపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదు'
కాగా భాజపా 'ఛలో హైదరాబాద్' పిలుపు మేరకు పోలీసులు ముందస్తుగా ఆయా ప్రాంత నేతలను అదుపులోకి తీసుకున్నారు. మెట్పల్లి, కోరుట్ల, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల్లోని నాయకులను పోలీస్స్టేషన్ తరలించారు.
ఇదీ చూడండి:'దుబ్బాకలో పెద్దఎత్తున డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారు'