తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోంది' - mp dharmapuri aravind updates

ఎంపీ అరవింద్ అరెస్టును నిరసిస్తూ... భాజపా నాయకులు నిరసన వ్యక్తం చేశారు. భైంసా బాధితులను పరామర్శించడానికి వెళ్తుంటే తెరాస ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు.

BJP leaders in Jagittala district's Metpalli and Korutla constituencies have raised concerns
'ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోంది'

By

Published : Mar 9, 2021, 1:22 PM IST

జగిత్యాల జిల్లా మెట్​పల్లి, కోరుట్ల మండలాల్లో భాజపా నాయకులు ఆందోళనకు దిగారు. ఎంపీ అరవింద్ అరెస్టును నిరసిస్తూ సీఎం కేసీఆర్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

నిర్మల్ జిల్లా భైంసాలో జరిగిన గొడవలో గాయపడిన బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వెళ్తున్న ఎంపీ ధర్మపురి అరవింద్​ని అరెస్ట్ చేయడం సరికాదన్నారు. తెరాస ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు.

ఇదీ చదవండి:'వీరుల త్యాగాలను తెలిపేలా 75వ స్వాతంత్ర్య దినోత్సవం'

ABOUT THE AUTHOR

...view details