దేశ ప్రజల రక్షణ కోసం ప్రధాని మోదీ నిరంతరం కృషి చేస్తున్నారని జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని భాజపా నేతలు పేర్కొన్నారు. కరోనా నుంచి రక్షించేందుకు ప్రజలందరికీ కేంద్ర ప్రభుత్వం ఉచితంగా టీకాలను అందిస్తామని ప్రకటించడంతో నాయకులంతా సంబురాలు జరుపుకున్నారు. పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ప్రధాని చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
మెట్పల్లిలో భాజపా నేతల సంబురాలు - ఉచిత కరోనా వ్యాక్సిన్
కేంద్రం.. ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ను అందిస్తామని ప్రకటించడంతో భాజపా నేతలు సంబురాలు జరుపుకుంటున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో.. పార్టీ ఆధ్వర్యంలో ప్రధాని చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.

free corona vaccine
కొవిడ్ పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని నేతలు సూచించారు. ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రభాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, తదితర నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:Etela : అపనిందలతో అవమానిస్తే రాజకీయంగా బుద్ధిచెబుతాం: ఈటల