కేంద్రం పసుపు దిగుమతి నిలిపివేయడంతోనే.. రాష్ట్రంలో పసుపు పంట ధరలకు రెక్కలొచ్చాయని కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కాటిపల్లి గోపాల్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్‌ను కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పసుపు మార్కెట్‌ను భాజపా నాయకులు సందర్శించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మద్దతు ధరలపై ఆరా తీశారు.
'ఎంపీ అర్వింద్ చొరవతోనే పసుపు ధరకు రెక్కలు' - మెట్పల్లి మార్కెట్లో భాజపా నేతల సంబురాలు
రాష్ట్రంలో పసుపు ధరలు పెరగడంపై జగిత్యాల జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు కాటిపల్లి గోపాల్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. దీని ద్వారా పసుపు రైతులకు లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు. మద్దతు ధర రావడానికి కృషి చేసిన ఎంపీ అర్వింద్ చిత్రపటానికి భాజపా నాయకులు పాలాభిషేకం చేశారు.
మెట్పల్లి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభమైనప్పటి నుంచి గతంలో కంటే పసుపు ధరలు పెరిగాయని గోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. ధరలు పెరగడానికి కృషిచేసిన నిజామాబాద్ ఎంపీ అర్వింద్ చిత్రపటానికి నాయకులు క్షీరాభిషేకం చేశారు. రైతులకు భాజపా ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పండించిన పంటను వివిధ చోట్లకు ప్రత్యేక రైళ్ల ద్వారా తరలించడంతో పసుపు పంటకు మద్దతు ధర పెరుగుతూ వస్తోందని నాయకులు అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి:ఆర్ఎంపీ ఇంట్లో పోలీసుల సోదాలు.. రూ.65.11 లక్షలు స్వాధీనం