రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రతీ కార్యకర్తపై ఉందని జగిత్యాల జిల్లా భారతీయ జనతాపార్టీ నేతలు అన్నారు. మెట్పల్లి పట్టణంలో పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండాను ఆవిష్కరించి మిఠాయిలు పంచుకున్నారు.
ఘనంగా భాజపా ఆవిర్భావ వేడుకలు - జగిత్యాల జిల్లాలో భాజపా ఆవిర్భావ వేడుకలు
జగిత్యాల జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ వేడుకలను కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో పార్టీ జెండా ఆవిష్కరించిన నేతలు అనంతరం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
మెట్పల్లిలో భాజపా ఆవిర్భావ వేడుకలు
భాజపా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు స్వచ్ఛ భారత్ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను గురించి ఇంటింటా ప్రచారం చేస్తూ.. పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని నేతలు కార్యకర్తలకు సూచించారు.
ఇదీ చదవండి:కరోనా సృష్టించిన దుర్భిక్షానికి మరో ప్రైవేట్ టీచర్ బలి