రైతులకు రుణమాఫీ, ఉచిత ఎరువులు అమలు చేయాలంటూ భాజపా నాయకులు ఆందోళన నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నిలుపుకోవాలని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లాకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం చౌరస్తాలో ధర్నా నిర్వహించారు.
రైతుల హామీలు అమలు చేయాలంటూ భాజపా ధర్నా - జిగిత్యాల తహసీల్దార్‌కు వినతిపత్రం
రైతులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని భాజపా ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. రెండేళ్లుగా ఉచితంగా ఎరువులు, రుణమాఫీ ఇవ్వడం లేదని ఆరోపించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం చౌరస్తాలో ఆందోళన నిర్వహించారు.
![రైతుల హామీలు అమలు చేయాలంటూ భాజపా ధర్నా BJP demands implementation to farmers free fertilizers scheme in the state in jagtial district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10649463-313-10649463-1613474457878.jpg)
తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పిస్తున్న భాజపా నాయకులు
రెండేళ్లుగా రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని భాజపా జిల్లా అధ్యక్షుడు మోరపల్లి సత్యనారాయణ విమర్శించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతి పత్రం సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రుణమాఫీ అమలు చేసి, ఉచిత ఎరువులు అందించాలని ఆయన డిమాండ్ చేశారు.