జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణం 8వ వార్డు భాజపా కౌన్సిలర్ జూగోని అనిల్ కుమార్ అనారోగ్యంతో మృతి చెందారు. చికిత్స నిమిత్తం.. కొన్ని రోజుల కిందట హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన అనిల్.. నేడు తెల్లవారుజామున కన్నుముశారు.
అనారోగ్యంతో భాజపా మున్సిపల్ కౌన్సిలర్ మృతి - జగిత్యాల జిల్లా
జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణం 8వ వార్డు భాజపా కౌన్సిలర్.. అనారోగ్యంతో మృతి చెందారు. యువ కౌన్సిలర్ మృతి పట్ల స్థానికులు సంతాపం వ్యక్తం చేశారు.
అనారోగ్యంతో భాజపా మున్సిపల్ కౌన్సిలర్ మృతి
కౌన్సిలర్ మృతి పట్ల స్థానికులు సంతాపం వ్యక్తం చేశారు. సొంత ఖర్చులతో కాలనీలను అభివృద్ధి చేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. కరోనా సమయంలోనూ ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారని గుర్తు చేశారు.
ఇదీ చదవండి:'చెట్టు కొట్టేస్తారా.. భరతం పట్టిన బాలుడు'