నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై దాడిని ఖండిస్తూ జగిత్యాల జిల్లా మెట్పల్లిలో భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఆందోళన బాట పట్టాయి. ఆదివారం వరంగల్‌లో భాజపా కార్యక్రమాలు ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో ఎంపీ అర్వింద్‌పై కొందరు దాడికి యత్నించారు. దీనికి నిరసనగా భాజపా నేతలు ఆందోళన చేశారు.
మెట్‌పల్లిలోని పాత బస్టాండ్ చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై భాజపా నాయకుల ధర్నా నిర్వహించారు. రోజురోజుకి రాష్ట్రంలో భాజపా ఆదరణ పెరగడం వల్ల ఓర్వలేకనే తెరాస నాయకులు విచక్షణ కోల్పోతూ... దాడులకు పాల్పడుతున్నారని జిల్లా అధ్యక్షుడు భాస్కర్ ఆరోపించారు.