జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో కరోనాతో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతదేహానికి దహనసంస్కారాలు నిర్వహించేందుకు బంధువులెవరూ ముందుకు రాకపోవడంతో స్థానిక భాజపా కార్యకర్తలు మానవతాదృక్ఫథంతో దహన సంస్కారాలు చేశారు.
కరోనా మృతుడికి అంత్యక్రియలు చేసిన భాజపా కార్యకర్తలు
కరోనాతో మృతి చెందినవారికి దహన సంస్కారాలు నిర్వహించేందుకు సన్నిహితులు కూడా వెనకడుగు వేస్తున్నారు. అలా అందరూ ఉన్నా.. మృతదేహాలు అనాథ శవాల్లా మారుతున్నాయి. జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో.. ఇలాగే బంధువులెవరూ ముందుకు రాకపోవడంతో ఓ మృతదేహానికి స్థానిక భాజపా కార్యకర్తలు మానవతా దృక్ఫథంతో అంతిమ సంస్కారాలు చేపట్టారు.
covid dead body cremation
మాజీ భాజపా కౌన్సిలర్ సుఖేందర్ గౌడ్.. పలువురు పార్టీ కార్యకర్తలతో కలిసి మృతదేహానికి అంతక్రియలు నిర్వహించారు. తమకు సమాచారం అందిస్తే.. కరోనాతో మరణించిన వారికి దహన సంస్కారాలు జరుపుతామని పట్టణ ప్రజలకు తెలిపారు.
ఇదీ చదవండి:జర్నలిస్టుల కోసం హెల్ప్‌డెస్క్... రేపటి నుంచే అందుబాటులోకి..