తెలంగాణ

telangana

ETV Bharat / state

మెట్​పల్లిలో భాజపా నాయకుల అరెస్టు

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో బంద్​ చేపట్టేందుకు సిద్ధమవుతున్న భాజపా నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్​కు తరలించారు.

మెట్​పల్లిలో భాజపా నాయకుల అరెస్టు

By

Published : May 2, 2019, 12:52 PM IST

మెట్​పల్లిలో భాజపా నాయకుల అరెస్టు

ఇంటర్ ఫలితాల్లో అవకతవకలకు నిరసనగా భాజపా రాష్ట్ర బంద్​కు పిలుపునిచ్చింది. మెట్​పల్లిలో బంద్​ చేసేందుకు సిద్ధమవుతున్న నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్​కు తరలించారు. జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో తెల్లవారుజామునే భాజపా నాయకులను వారి ఇళ్లలో నుంచి తీసుకువచ్చి స్టేషన్​లో ఉంచారు. నాయకులను అరెస్టు చేస్తూ ఎక్కడికక్కడ బంద్​ జరగకుండా చూస్తున్నారు పోలీసులు. అక్రమంగా అరెస్టు చేయడం ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని కోరుట్ల నియోజకవర్గ భాజపా ఇంఛార్జీ వెంకట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటర్ ఫలితాల్లో తప్పిదాల వల్ల పిల్లలెందరో చనిపోతున్నా.. పట్టించుకోని ఈ ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details