రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 45 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా వద్ద భాజపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా నిరుద్యోగులకు వెంటనే నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగులకు 45 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలి: భాజపా - ఉద్యోగులకు 45 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని భాజపా ధర్నా
ప్రభుత్వ ఉద్యోగులకు మెరుగైన ఫిట్‌మెంట్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని భాజపా నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 45 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలి: భాజపా
ఆర్డీవో కార్యాలంయంలోకి వెళ్లి నినాదాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకోవటంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తెరాస పభుత్వం వెంటనే అమలు చేయాలని.. లేని పక్షంలో ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:పెళ్లి నగలు కొందామని బయల్దేరిన వధువు సహా ఆరుగురు మృతి