కేంద్రం తెచ్చిన నూతన చట్టం.. కోట్పా నుంచి బీడీ పరిశ్రమను మినహాయించాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా మల్లాపూర్లో బీడీ కార్మికులు ఆందోళన బాట పట్టారు. బీడీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో.. బస్టాండ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేసి.. సమస్యను విన్నవించుకున్నారు.
'కోట్పా చట్టం నుంచి బీడీ పరిశ్రమను మినహాయించండి' - బీడీ కార్మికుల ధర్నా
జగిత్యాల జిల్లా మల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీడీ కార్మికులు ధర్నా నిర్వహించారు. కోట్పా చట్టం నుంచి బీడీ పరిశ్రమను మినహాయించాలని డిమాండ్ చేశారు.
'కోట్పా చట్టం నుంచి బీడీ పరిశ్రమను మినహాయించండి'
చట్టం నుంచి బీడీ పరిశ్రమను తొలగించకుంటే.. లక్షలాది మంది కార్మికుల కుటుంబాలు రోడ్డున పడతాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం.. కోట్పా చట్టం నుంచి బీడీ పరిశ్రమను మినహాయించని పక్షంలో, రానున్న రోజుల్లో ఆందోళన ఉధృతం చేస్తామని సంఘం నాయకుడు మౌలానా హెచ్చరించారు.
ఇదీ చదవండి:'రైతు మద్దతుదారులపై మోదీ సర్కార్ దాడులు'