బతుకమ్మ చీరల పంపిణీ చేసిన ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ - batukamma sarees distribution
జగిత్యాల జిల్లా లక్ష్మీదేవిపల్లిలో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, జడ్పీ ఛైర్ పర్సన్ దావ వసంత గ్రామంలోని ఆడపడచులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.
బతుకమ్మ చీరల పంపిణీ
తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, జడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత ఆకాంక్షించారు. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం లక్ష్మీదేవిపల్లిలో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణీలో వారు పాల్గొని మహిళలకు చీరలను అందజేశారు. కార్యక్రమానికి మహిళలు భారీ సంఖ్యలో హాజరై చీరలను తీసుకున్నారు.