రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో నరేంద్ర డిగ్రీ కళాశాలలో విద్యార్థులు బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. విద్యార్థులు వివిధ రకాల పూలను సేకరించి తీసుకొచ్చి అందంగా బతుకమ్మలను తయారు చేశారు. అనంతరం పాటలు పాడుతూ బతుకమ్మ ఆటలు ఆడారు. బతుకమ్మ పండుగ విశిష్టత గురించి అధ్యాపకులు విద్యార్థులకు వివరించారు.
ఒక్కేసి పువ్వేసి చందమామ.. ఒక్కజాములాయే చందమామ - బతుకమ్మ
జగిత్యాల జిల్లా మెట్పల్లిలో బతుకమ్మ సంబురాలు అంగరంగ వైభవంగా జరిగాయి.
ఒక్కేసి పువ్వేసి చందమామ.. ఒక్కజాములాయే చందమామ