తెలంగాణ

telangana

ETV Bharat / state

రెండో రోజు కొనసాగుతున్న బ్యాంకు ఉద్యోగుల సమ్మె - జగిత్యాల జిల్లా తాజా వార్తలు

కేంద్రం తీసుకుంటున్న బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగ సంఘాలు చేపట్టిన సమ్మె జగిత్యాల జిల్లాలో రెండో రోజు కొనసాగుతోంది. యూఎఫ్​బీయూ దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడంతో ఉద్యోగులు విధులను బహిష్కరించి ఆందోళన చేస్తున్నారు.

Bank workers strike for second day in Jagitial district
రెండో రోజు కొనసాగుతున్న బ్యాంకు ఉద్యోగుల సమ్మె

By

Published : Mar 16, 2021, 12:36 PM IST

బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగ సంఘాలు చేపట్టిన సమ్మె జగిత్యాల జిల్లాలో రెండో రోజు కొనసాగుతోంది. యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంకు యూనియన్‌ పిలుపుతో దేశవ్యాప్తంగా ఉద్యోగులు విధులను బహష్కరించి ఆందోళన చేస్తున్నారు.

జగిత్యాల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్‌ నుంచి కొత్త బస్టాండ్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉద్యోగులు నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: నోముల సంతాప తీర్మానం ప్రవేశపెట్టాల్సి రావడం బాధాకరం: కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details