జగిత్యాల జిల్లాలో ప్రభుత్వ రంగ బ్యాంకుల సమ్మెతో బ్యాంకు సేవలు నిలిచిపోయాయి. జిల్లా వ్యాప్తంగా 50కిపైగా బ్యాంకులు మూతపడగా... 250 మందికి పైగా ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. అధికారులు మొండివైఖరి వీడి తమ సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ సమ్మెతో ఖాతా దారులు ఇబ్బంది పడుతున్నారు. అత్యవసరం కోసం కేవలం డిపాజిట్ మిషన్లు మాత్రమే ఉపయోగిస్తున్నారు.
జగిత్యాల జిల్లాలో బ్యాంకు ఉద్యోగుల సమ్మె.. ప్రజల ఇబ్బందులు - బ్యాంకు ఉద్యోగుల సమ్మె
జగిత్యాలలో బ్యాంకు ఉద్యోగుల సమ్మెతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం జిల్లావ్యాప్తంగా 250 మందికిపైగా ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొన్నారు.
జగిత్యాల జిల్లాలో బ్యాంకు ఉద్యోగుల సమ్మె.. ప్రజల ఇబ్బందులు
జగిత్యాలలో ప్రైవేట్ బ్యాంకులు మాత్రం పని చేస్తున్నాయి. రేపు కూడా సమ్మె కొనసాగనుండగా.. ఆదివారం సెలవుదినం కావడం వల్ల సోమవారం బ్యాంకు సేవలు కొనసాగుతాయి.
ఇవీ చూడండి:రాయితీల కోసం.. బయో మోసం..