తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రాచీన పల్లె గీతాలకు ప్రజాదరణ ఎప్పుడూ ఉంటుంది: బండి సంజయ్​ - జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చెప్యాలలో బండిసంజయ్​

జానపద కళా ప్రదర్శనకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ హాజరయ్యారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చెప్యాలలో ఓరుగంటి శేఖర్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

bandi sanjay visited  village folk songs exhibition in chepyala village in  jagtial district
జానపద కళా ప్రదర్శనకు హాజరైన బండి సంజయ్​

By

Published : Mar 15, 2021, 9:52 AM IST

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చెప్యాలలో జానపద కళాకారుడు ఓరుగంటి శేఖర్ నిర్వహించిన కార్యక్రమానికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హాజరయ్యారు. జానపద కళా ప్రదర్శన నిర్వహించగా బండి సంజయ్ ఆసక్తిగా గమనించారు.

మన ప్రాచీన పల్లె గీతాలకు ప్రజాదరణ ఉందని ఆయన అన్నారు. గ్రామాల్లో ప్రాచుర్యం పొందిన పాటలను ప్రత్యేకంగా తిలకించారు. తెరాస నాయకుడు ఏనుగు మనోహర్ రెడ్డి జానపద కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇదీ చూడండి:క్రీడా శిక్షకుల కొరత.. పోటీలో వెనుకబడుతున్న రాష్ట్రం

ABOUT THE AUTHOR

...view details