Bandi Sanjay fires on CM KCR : విద్యుత్‌రంగంలో హైదరాబాద్‌ను పవర్‌ఐలాండ్‌గా మార్చామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తోసిపుచ్చారు. చినుకు పడితే అంధకారమయ్యే హైదరాబాద్ పవర్ ఐలాండ్‌గా మారిందనడం హస్యాస్పదంగా ఉందని విమర్శించారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో ప్రజాసంగ్రామ యాత్రలో పాల్గొన్న బండి సంజయ్ సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్ పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలుచేయలేదో సమాధానం చెప్పాలని సంజయ్ డిమాండ్ చేశారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పులకుప్పగా మార్చి ప్రజలను బిచ్చగాళ్లను చేయడమేనా తెలంగాణ మోడల్ అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఒకే కుటుంబం లక్ష కోట్లు దోచుకోవడమెలా.... అనేది దేశానికి చాటిచెప్పడమేనా తెలంగాణ మోడల్ అంటే అని బండి సంజయ్ నిలదీశారు. ఏడాదిలో 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని హామీ ఇచ్చారని బండి సంజయ్ తెలిపారు.
'బీఆర్ఎస్ సమావేశంలో ఒక్కరి మెుహంలో కూడా నవ్వు లేదు. పార్టీ ఆవిర్భావ సభలా లేదు.. సంతాప సభలా ఉంది. పార్టీ పేరు జెండా నుంచి తెలంగాణ పేరు తొలగించారు. తెలంగాణ గురించి మాట్లాడే అర్హత కేసీఆర్ కోల్పోయారు. బీఆర్ఎస్ కాదు.. బందిపోట్ల రాష్ట్ర సమితి అది. మద్యం స్కాం పక్కకు పోయేందుకే బీఆర్ఎస్ అంటూ నాటకాలు. కుటుంబాన్ని కాపాడుకునేందుకే కేసీఆర్ ప్రయత్నం. 2 రాష్ట్రాల నాయకులు కుట్రలతో సెంటిమెంట్ రగల్చాలని చూస్తున్నారు. కాషాయ జెండా కాంతిలో అన్ని రంగుల జెండాలు మాడి మసైపోతాయి. కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చారు?.'-బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
ఇచ్చిన హామీ మేరకు ఇటీవల 1.46 లక్షల ఉద్యోగాలు ఇచ్చారని పేర్కొన్నారు. మిషన్ భగీరథ పథకం నీళ్లు ఏ ఇంటికైనా వస్తున్నాయా అని ప్రశ్నించారు. బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామన్న హామీ ఏమైందని బండి సంజయ్ నిలదీశారు. భాజపా అధికారంలోకి వస్తే గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక పాలసీ తెస్తామన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు రావాల్సిందేనని తెలిపారు. ముత్యంపేట షుగర్ పరిశ్రమ నడవాలంటే భాజపా రావాలన్నారు. గల్ఫ్ వెళ్లిన వేలాది మంది కార్మికులు జైలులో ఉంటున్నారన్న ఆయన.. గల్ఫ్ నుంచి తిరిగివస్తే ఇక్కడ ఉపాధి దొరకని విధంగా రాష్ట్ర పరిస్థితి తయారయ్యిందని బండి సంజయ్ ధ్వజమెత్తారు.
'చినుకు పడితే అంధకారమయ్యే హైదరాబాద్ పవర్ ఐలాండ్‌గా మారిందనడం హస్యాస్పదం' ఇవీ చదవండి: