తెలంగాణ

telangana

ETV Bharat / state

అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు ఆస్ట్రేలియా నుంచి సాయం - jagityala news

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఓ పేద మహిళకు ఆస్ట్రేలియాలో ఉంటున్న తెలుగు యువకులు సాయమందించారు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం వెల్గొండకు చెందిన మహిళ పరిస్థితిని స్థానికులు ఆస్ట్రేలియా మిత్రులకు తెలియజేయగా... చలించిన యువకులు వైద్యానికి చేయూతనందించారు.

Australia young man helped to poor women
Australia young man helped to poor women

By

Published : Aug 4, 2020, 7:31 PM IST

జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం వెల్గొండలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న పేద మహిళకు ఆస్ట్రేలియాలో ఉంటున్న తెలుగు యువకులు చేయూతనందించారు. గ్రామానికి చెందిన బక్కవ్వ కొన్ని నెలలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. బక్కవ్వ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారటం వల్ల ఇటీవల ఆస్పత్రిలో చేరింది. చికిత్సకు డబ్బులు లేకపోవడం వల్ల స్థానిక మిత్రులు ఆస్ట్రేలియాలో ఉంటున్న శనిగరపు తిరుపతికి బాధితురాలి పరిస్థితి వివరించారు. స్పందించిన తిరుపతి, అక్కడే ఉంటున్న తన మిత్రులు కలిసి రూ. 45వేలను చికిత్స కోసం ఆర్థిక సాయంగా అందించారు.

ఇదీ చదవండి:ఆన్​లైన్​లో అందుకు ఆసక్తి చూపారో... ఇక అంతే సంగతి!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details