తెలంగాణ

telangana

ETV Bharat / state

ధర్మపురి నరసింహ స్వామి ఆలయం అధికారులు సందర్శన - తెలంగాణ తాజా వార్తలు

యాదాద్రి టెంపుల్​ మాదిరిగా జగిత్యాల జిల్లాలోని ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని కూడా పునర్​ నిర్మాణం చేయనున్నట్లు పురావస్తు శాఖ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయాన్ని పురావస్తు శాఖ అధికారులు తనిఖీ చేశారు.

Dharmapuri Narasimha Swamy Temple
ధర్మపురి నరసింహ స్వామి ఆలయం అధికారులు సందర్శన

By

Published : Jun 24, 2021, 10:27 AM IST

యాదాద్రి ఆలయ నిర్మాణ తరహాలోనే సీఎం కేసీఆర్​ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లాలోని ధర్మపురి లక్ష్మీ నరసింహాస్వామి ఆలయాన్ని పునర్​ నిర్మాణం చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. పురాతన ఆలయం కావడం వల్ల పురావస్తు శాఖ అనుమతులు తప్పనిసరి అన్నారు.

మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచనల మేరకు ఆలయ పరిసరాలను పురావస్తు అధికారులు బి.నారాయణ, రాములు నాయక్, సాగర్, మాధవి పరిశీలించారు. ఉగ్రనరసింహా, యమ ధర్మరాజు, సత్యవతి ఆలయాలు, వైకుంఠ ద్వారం, మహారాజ గోపురం, బ్రహ్మ పుష్కరిణిని వారు గమనించారు. పరిశీలించిన అంశాలపై ప్రభుత్వానికి నివేదిక పంపుతామని పురావస్తు శాఖ అధికారులు తెలిపారు. వేద పండితుల ద్వారా మరిన్ని వివరాలు వారు అడిగి తెలుసుకున్నారు.

ఇదీ చూడండి:విద్యుత్ రీడింగ్​లో అవకతవకలు.. ఖజానాకు గండి

ABOUT THE AUTHOR

...view details