జగిత్యాల జిల్లాలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆదివారం కొత్తగా మరో 2 పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్యాధికారి పుప్పాల శ్రీధర్ వెల్లడించారు. తాజా కేసులతో మొత్తం బాధితుల సంఖ్య 105కు చేరగా.. ముగ్గురు మృత్యువాతపడ్డారు.
జగిత్యాలలో మరో 2 కరోనా కేసులు.. బాధితుల్లో ఓ వైద్యుడు - జగిత్యాల జిల్లా కరోనా కేసుల వార్తలు
జగిత్యాల జిల్లాలో కొవిడ్-19 చాపకింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా మరో ఇద్దరు ఈ మహమ్మారి బారినపడ్డారు. ఫలితంగా జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 105కు చేరింది.
జగిత్యాలలో మరో 2 కరోనా కేసులు.. బాధితుల్లో ఓ వైద్యుడు
ఆదివారం పాజిటివ్ వచ్చిన వారిలో ఓ వైద్యుడు ఉండగా.. కోరుట్లకు చెందిన మరో వ్యక్తి ఈ వైరస్ బారినపడ్డారు. డాక్టర్‌కు కొవిడ్ సోకడం వల్ల అతని వద్ద చికిత్స తీసుకున్న రోగులు ఆందోళన చెందుతున్నారు.