తెలంగాణ

telangana

ETV Bharat / state

గాంధీ వేషధారణలో ఆర్టీసీ కార్మికుడి శాంతి పోరాటం - ఆర్టీసీ కార్మికులలో ఓ వ్యక్తి గాంధీ వేషధారణలో నిరసన

జగిత్యాల జిల్లా మెట్​పల్లి ఆర్టీసీ డిపో ఎదుట ఓ ఆర్టీసీ కార్మికుడు గాంధీ వేషధారణతో శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు.

ఆర్టీసీ కార్మికులతో ఆనంద్​ 'గాంధీ' నిరసన

By

Published : Nov 2, 2019, 8:00 PM IST

సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న ఆందోళనలో ఒక కార్మికుడు వినూత్నంగా మహాత్మాగాంధీ వేషధారణతో వచ్చి నిరసన తెలిపి చూపరులను ఆకట్టుకున్నాడు. జగిత్యాల జిల్లా మెట్​పల్లి డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు గత 28 రోజుల నుంచి వివిధ రకాలుగా నిరసనలు చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు.

ఆర్టీసీ కార్మికులతో ఆనంద్​ 'గాంధీ' నిరసన

దీనిలో భాగంగా డిపో ముందు ఆందోళన చేస్తున్న కార్మికులలో ఆనంద్ అనే కార్మికుడు మహాత్మాగాంధీ వేషధారణలో డిపోకు వచ్చాడు. కార్మికులతో కలిసి డిపో ముందు ఆందోళన నిర్వహించాడు. కార్మికులంతా శాంతియుతంగా పోరాటం చేద్దాం.. ఆందోళనతో ఉద్యమం వద్దు అంటూ కార్మికులకు తెలిపాడు.

ఇదీ చూడండి: ఆర్టీసీ ఐకాస, విపక్ష నేతల సమావేశం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details