తెలంగాణ

telangana

ETV Bharat / state

అయినా వాళ్లు దగ్గరికి రాలేదు.. ఆ నలుగురే అన్ని తానై వచ్చారు..

కరోనా సోకిన వ్యక్తి మృతి చెందితే కనీసం కుటుంబ సభ్యులు కూడా అంతక్రియలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో నా అన్న వాళ్లు ముందుకు రాని పరిస్థితుల్లో కులమతాలకు అతీతంగా కరోనాతో మృతి చెందిన వారికి కన్న కొడుకులా మారి అన్నీ తానై ముందుకు వస్తున్నారు ముస్లిం మైనార్టీ యువకులు. కరోనా మృతులకు వారి ఆచారం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించి ఆదర్శంగా నిలుస్తున్నారు ఆ నలుగురు.

By

Published : Sep 2, 2020, 9:14 AM IST

an old man died with corona in jagityala district
అయినా వాళ్లు దగ్గరికి రాలేదు.. ఆ నలుగురే అన్ని తానై వచ్చారు..

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో 60 ఏళ్ల వృద్ధుడు కరోనాతో మృతి చెందాడు. రెండు రోజుల క్రితం ర్యాపిడ్ పరీక్ష నిర్వహించారు. అందులో పాజిటివ్ అని నిర్ధరణ అయింది. చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ మరణించాడు. కరోనాతో మృతి చెందడం వల్ల అంతక్రియలు నిర్వహణకు కుటుంబసభ్యులు, బంధువులు ముందుకు రాలేదు.

దీనితో మృతుడి కుమారుడు కోరుట్లకు చెందిన ముస్లిం మైనార్టీ యువకులు ఏర్పాటు చేసిన ఆలిండియా మానవత్వ సందేశ సమితి అనే స్వచ్ఛంద సంస్థ సభ్యులకు చరవాణి ద్వారా సమస్యను దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో సంస్థకు చెందిన నజీర్అలీ, ఇషాక్, హఫీజ్, ముజాహిద్ కలిసి కొవిడ్​ నిబంధనల మేరకు పీపీఈ కిట్లు ధరించి.. అన్నీ తానై ఆ నలుగురు ఆ వృద్ధునికి స్మశాన వాటికలో అంతక్రియలు నిర్వహించారు.

మతాలకు అతీతంగా ఈ స్వచ్ఛంద సంస్థ ధైర్యంగా ముందుకు వచ్చారు. కొవిడ్​తో మరణించిన వారికి సొంత కొడుకులా మారి.. వారికి అంత్యక్రియలు నిర్వహిస్తూ.. మానవత్వాన్ని కాపాడుతున్నారు. ఈ సంస్థ వారు ఇప్పటివరకు కోరుట్ల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో కరోనాతో మరణించిన పది మందికి వారి ఆచారాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించి ఆదర్శంగా నిలుస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details