శ్రావణమాసాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లాలోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మెట్పల్లిలోని వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి విశేష పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్చకుల మంత్రోచ్ఛారణల నడుమ అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, కుంకుమ పూజ నిర్వహించారు. అనంతరం పువ్వులతో పుష్పార్చన చేశారు. వేదపండితులు మంగళహారతులిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మొక్కులు చెల్లించుకున్నారు.
కన్యకాపరమేశ్వరికి విశేష పుష్పార్చన - కన్యకాపరమేశ్వరికి విశేష పుష్పార్చన
జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో శ్రావణమాసాన్ని పురస్కరించుకుని విశేష పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు.
కన్యకాపరమేశ్వరికి విశేష పుష్పార్చన