తెలంగాణ

telangana

భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయం.. రాకపోకలకు అంతరాయం

By

Published : Sep 18, 2020, 2:04 PM IST

Updated : Sep 18, 2020, 5:52 PM IST

జగిత్యాల జిల్లాలోని పలు మండలాల్లో కురిసిన ఎడతెరిపి లేని వర్షాలకు చిన్నాపూర్ వద్ద 63వ నెంబర్ జాతీయ రహదారిపై వరదనీరు పొంగుతోంది. రహదారులపై వరద ప్రవహిస్తుండటం వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయం.. రాకపోకలకు అంతరాయం
భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయం.. రాకపోకలకు అంతరాయం

జగిత్యాల జిల్లా ధర్మపురి, బుగ్గారం మండలాల్లో భారీ వర్షం కురిసింది. చిన్నాపూర్ వద్ద 63వ నెంబర్ జాతీయ రహదారిపై నుంచి వరదనీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సహజ కాల్వలను కబ్జాదారులు ఆక్రమించడంతోనే వరద వల్ల ఇబ్బందులు వస్తున్నాయని పలు గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

యువత సహకారం

వరద ప్రవాహం తగ్గాక వెలుగొండ, చిన్నపూర్ గ్రామానికి చెందిన యువకులు ట్రాఫిక్​కు మరింత ఇబ్బంది కాకుండా ఉండేందుకు వాహనదారులకు సహకరించారు. నేరేళ్ల, బుగ్గారం గ్రామాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయం.. రాకపోకలకు అంతరాయం

ఇవీ చూడండి : అత్తింటి నుంచి వివాహిత అదృశ్యం.. పోలీసులకు భర్త ఫిర్యాదు

Last Updated : Sep 18, 2020, 5:52 PM IST

ABOUT THE AUTHOR

...view details