తెలంగాణ

telangana

ETV Bharat / state

'తక్షణమే విడుదల చేయాలని డిమాండ్' - jagityala updates

కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ కరపత్రాలు పంచుతున్న పౌర హక్కుల సంఘం నాయకులని జగిత్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు చేసిన తమ నాయకులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

agittala police have arrested leaders of a civil rights group who were distributing pamphlets protesting the central government's behavior
'తక్షణమే విడుదల చేయాలని డిమాండ్'

By

Published : Jan 9, 2021, 7:13 PM IST

జగిత్యాల జిల్లాలో అక్రమంగా అరెస్ట్ చేసిన పౌర హక్కుల నాయకులని వెంటనే విడుదల చేయాలని తెలంగాణ పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ కోరారు.

ఖండించారు

దిల్లీలో రైతులు చేస్తున్న డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ.. జగిత్యాల జిల్లాలో కర పత్రాలు పంచుతున్న తమ సంఘం నాయకులను పోలీసులు అరెస్టు చేసిన తీరును ఖండించారు. అరెస్ట్ అయిన వారిలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కుమార స్వామి, జగిత్యాల జిల్లా కార్యదర్శి మల్లా రెడ్డి, రాజేష్ తదితరులు ఉన్నట్లు తెలిపారు.

అరెస్ట్ చేసిన వారి..

పౌర హక్కుల నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వివరాలు చెప్పక పోవటం దారుణమన్నారు. పోలీసుల తీరును ఖండిస్తూ.. అరెస్టు చేసిన తమ సంఘం నాయకులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

'పౌర హక్కుల సంఘం నాయకులపై జగిత్యాల పోలీసుల తీరుని ఖండిస్తున్నాం. అక్రమంగా అరెస్ట్ చేసిన వారి వివరాలను పోలీసులు చెప్పక పోవటం దారుణం. వారిని తక్షణమే విడుదల చేయాలి.'

-రఘునాథ్, తెలంగాణ పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు.

ఇదీ చదవండి:అన్నాడీఎంకే సీఎం అభ్యర్థిగా పళనిస్వామి

ABOUT THE AUTHOR

...view details