ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తెరాసకు చెంపపెట్టని కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ అన్నారు. గతంలో ప్రజా సమస్యలకు సమయం ఇవ్వని సీఎం.. నేడు సోషల్ మీడియాలో ఫిర్యాదులకు స్పందించి కలెక్టర్లతో మాట్లాడి తాను బాగా పనిచేస్తున్నట్లు ఎన్నికల సమయంలో నిరూపించుకునే ప్రయత్నం చేశారని పొన్నం ఆరోపించారు. 16 ఎంపీ సీట్లనూ కాంగ్రెస్కు ఇస్తే కేసీఆర్ ఫాంహౌస్ వీడి సచివాలయం బాటపడతారన్నారు. వినోద్ కుమార్ ఏ పార్టీ నుంచి మంత్రి అవుతారో చెప్పాలని తెరాస నేతలను పొన్నం డిమాండ్ చేశారు.
'ఏ పార్టీ నుంచి కేంద్రమంత్రులు అవుతారు..?' - Ponnamfires on trs
ఈనాటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ గెలవాల్సిన అవసరం ఉందని కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ప్రశ్నించే వారు లేకపోతే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని హెచ్చరించారు.
'ఏ పార్టీ నుంచి కేంద్రమంత్రులు అవుతారో చెప్పండి?'
Last Updated : Mar 31, 2019, 1:44 PM IST