అద్భుతమైన సూక్ష్మకళతో అత్యంత సుందరంగా మహిళ విగ్రహ రూపాన్ని ప్రతిబింబింప చేశాడు జగిత్యాలకు చెందిన ఓ కళాకారుడు. సోమవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగాసనం వేస్తున్న అతిసూక్ష్మ రూపాన్ని తీర్చిదిద్దాడు. ఓ సూది మొనపై 0.2 మిల్లీ గ్రాముల బంగారు విగ్రహాన్ని తయారు చేసి తన ప్రతిభను చాటుకున్నాడు.
యోగాపై అవగాహన కల్పించేందుకే:
జగిత్యాలకు చెందిన గుర్రం దయాకర్ దాదాపు 8 గంటల సమయం పట్టిందని తెలిపారు. కరోనా సమయంలో చాలా మంది వ్యక్తులు యోగా చేయడం వల్ల తొందరగా కోలుకున్నారని ఆయన పేర్కొన్నారు. నిజంగా యోగా భారతదేశకి గొప్ప వరం లాంటిదని అన్నారు. యోగా గురించి సమాజానికి అవగాహన కల్పించేందుకే ఇలా బంగారు విగ్రహాన్ని సూది మొనపై తయారు చేశానని గుర్రం దయాకర్ తెలిపారు.
ఇదీ చూడండి:CM KCR : సిద్దిపేటలో ప్రభుత్వ కార్యాలయాలు ప్రారంభించిన సీఎం