కరోనా కారణంగా మరోసారి ప్రైవేటు పాఠశాలల మూసివేత.. ఉపాధ్యాయులను ఆందోళనకు గురిచేస్తోంది. జీతాల్లేక రోడ్డున పడుతున్నామంటూ జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని టీచర్ల నిరసన కార్యక్రమంలో.. ఓ పాప ప్లకార్డు ప్రదర్శన స్థానికులను ఆలోచింపజేసింది. ఉద్యోగం కోల్పోయిన తన తండ్రిని ఆదుకోవాలని విన్నవిస్తూ.. ఓ ప్రైవేటు ఉపాధ్యాయుడి కూతురు, సీఎంను వేడుకున్న విధానం సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు వైరల్ అవుతోంది.
'పాఠశాల మూతపడటంతో మా ఇల్లు గడవడం కష్టంగా మారింది.. మా నాన్న లాంటి ఎంతో మంది ప్రైవేటు టీచర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయి.. కేసీఆర్ తాత.. మీరే వారందరినీ ఆదుకోవాలి... ఉపాధి కోల్పోయిన ఉపాధ్యాయులకు ఆర్థిక సాయం చేయాలంటూ..' సురేందర్ అనే ఉపాధ్యాయుడి కుమార్తె ప్రణవి.. సీఎంకు విన్నవించుకుంది. ప్లకార్డు ప్రదర్శన చేస్తూ.. ఆవేదన వ్యక్తం చేసింది.