కొవిడ్ కారణంగా పాఠశాలలు మూతపడడం వల్ల ఆన్‌లైన్ పాఠాలతో కొత్తగా నేర్చుకునేది దేవుడెరుగు... ఇప్పటికే నేర్చుకున్నది కూడా మర్చిపోతున్నారు. చెట్టు కింద కూర్చున్నా.. గదుల్లో కూర్చున్నా... ఆ బడి వాతావరణం పిల్లలకు చదువుపట్ల శ్రద్ధ తీసుకువస్తుంది. ఆన్‌లైన్ చదువుల్లో అది ఉండటం లేదు. పిల్లల చదువులపై దృష్టి పెట్టిన జగిత్యాల జిల్లా (jagtial) కొడిమ్యాల మండలం దమ్మయ్యపేట (dammayapet) గ్రామస్థులు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. పిల్లలు పాఠాలు మర్చిపోకుండా ఉండేలా పునశ్చరణ తరగతులు నిర్వహిస్తున్నారు (village school). గ్రామంలో ఐదో తరగతి లోపు చిన్నారులకు 2 నెలలుగా ప్రత్యేక పాఠశాల నడుపుతున్నారు.
ఇది ప్రైవేటు పాఠశాల కాదు. గ్రామస్థుల సహకారంతో ఏర్పాటు చేశారు. పిల్లలు అందరూ బాగానే చదువుతున్నారు. పాఠాలు మరచిపోకుండా పునశ్ఛరణ చేయిస్తున్నాము. పాఠశాలలు తెరిచేనాటి పాఠాలు కొత్తగా అనిపించకుండా ఉపయోగపడుతుంది. -బొందు హేమ, ట్యూటర్
తలా కొంత వేసుకుని
గ్రామస్థులు (villagers school) తలా కొంత మొత్తం వేసుకుని సుమారు రూ.30 వేలతో గ్రామంలోనే ఒక షెడ్డు నిర్మించారు. అందులోనే పిల్లలకు చదువులు చెబుతున్నారు. అదే గ్రామానికి చెందిన ఇంటర్ పూర్తి చేసిన బొందు హేమ అనే యువతితో తరగతులు చెప్పిస్తున్నారు. అందుకుగాను నెలకు కొంత మొత్తం ఇస్తున్నారు.