తెలంగాణ

telangana

ETV Bharat / state

బస్టాండ్‌ ప్లాట్‌ ఫాంపై ద్విచక్రవాహన పార్కింగ్‌

ప్రభుత్వం స్థలం అయితే చాలు.. బస్టాండ్‌ ప్లాట్​ ఫాంన్ని కూడా కొందరు వాహన చోదకులు పార్కింగ్‌ స్థలంగా వినియోగిస్తున్నారు. జగిత్యాల బస్టాండ్‌లో బస్సులు నిలిపే ప్లాట్ ఫాంపైనే ద్విచక్ర వాహనానికి తాళం వేసి వదిలి వెళ్లాడు ఓ వాహన చోదకుడు.

By

Published : Aug 5, 2019, 4:26 PM IST

ప్లాట్ ఫాంపైనే ద్విచక్ర వాహనానికి తాళం వేసి వదిలి వెళ్లాడో వాహనదారుడు

జగిత్యాల జిల్లాలో ఓ వాహనదారుడు ఆర్టీసీ బస్ స్టాండ్​లోని ప్లాట్​ ఫాం వద్ద తన ద్విచక్ర వాహనాన్ని నిలిపి ఉంచాడు. మూడు గంటల పాటు వేచి చూసిన ఆర్టీసీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం వాహనాన్ని ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. బస్సులు నిలిపే ప్లాట్‌ ఫాంపైనే వాహనం ఉండటం వల్ల వాటి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆ ద్విచక్రవాహనం ఎవరిది ? ప్లాట్‌ ఫాంపైనే వాహనం వదిలి వెళ్లటానికి కారణం ఏమిటనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ప్లాట్ ఫాంపైనే ద్విచక్ర వాహనానికి తాళం వేసి వదిలి వెళ్లాడో వాహనదారుడు
ఇవీ చూడండి : రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో.. కొలువుల జాతర

ABOUT THE AUTHOR

...view details