ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా.. అద్దె ఇంటి వారికి కష్టాలు తెచ్చి పెట్టింది. జగిత్యాల విద్యానగర్‌లో ఉంటూ ఉపాధి నిమిత్తం దుబాయి వెళ్లి వచ్చిన ఓ వ్యక్తి కుటుంబాన్ని వెంటనే ఇల్లు ఖాళీ చేయాలంటూ స్థానికులు, ఇంటి యజమాని డిమాండు చేశారు. విమానాశ్రయంలో అతనికి పరీక్షలు చేయగా నెగిటివ్ వచ్చింది.
దుబాయ్ నుంచి వచ్చావ్...ఇల్లు ఖాళీ చేయండి.. - కరోనా కష్టాలు
జగిత్యాల జిల్లా విద్యానగర్‌లో అద్దెకుంటున్న ఓ వ్యక్తి ఇటీవలే దుబాయ్ నుంచి వచ్చాడు. కరోనా కారణంగా అతన్ని ఇంటి యజమానికి లోపలికి రానివ్వలేదు. కుటుంబ సభ్యులను ఇల్లు ఖాళీ చేయాలంటూ కాలనీ వాసులు పట్టుపట్టారు.
దుబాయ్ నుంచి వచ్చావ్...ఇల్లు ఖాళీ చేయండి..
అతను ఇంట్లోకి రానివొద్దంటూ కాలనీ వాసులు పట్టుబట్టారు. సమాచారం తెలుసుకున్న జగిత్యాల ఆర్డీవో నరేందర్ కాలని వాసులకు అవగాహన కల్పించారు. మరోసారి స్థానికంగా వైద్యపరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. అతన్ని మరోసారి జగిత్యాల ప్రభుత్వ వైద్యశాలలో పరీక్షల కోసం తరలించారు.
ఇవీ చదవండి:కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు