తెలంగాణ

telangana

ETV Bharat / state

Corona Vaccination Telangana : 'మీ కాళ్లు మొక్కుతా.. నాకు టీకా వద్దు సర్‌' - జగిత్యాల జిల్లా కొవిడ్​ న్యూస్​

old woman rejected covid vaccine: ఇంటింటికి తిరుగుతూ టీకాలు పంపిణీ చేస్తున్న సిబ్బందికి జగిత్యాల జిల్లా మెట్​పల్లి మండలంలో వింత పరిస్థితి ఎదురైంది. ఓ వృద్ధురాలు టీకా వేసుకోనని తెగేసి చెప్పడంతో వైద్యాధికారులు నిర్ఘాంతపోయారు. వ్యాక్సిన్ తీసుకుంటే మంచిదని తప్పనిసరిగా వేసుకోవాలని నచ్చజెబుతూ ప్రజాప్రతినిధులు బతిమలాడగా.. 'మీకు దండం పెడుతా నాకు టీకా వద్దంటూ' వృద్ధురాలు హంగామా సృష్టించింది.

Vaccine Rejected
Vaccine Rejected

By

Published : Dec 9, 2021, 4:51 AM IST

Updated : Dec 9, 2021, 6:23 AM IST

కొవిడ్​ టీకా వేసుకోనంటూ మొండికేసిన వృద్ధురాలు...

old woman rejected covid vaccine : కరోనా నుంచి కాపాడుకోవడానికి వ్యాక్సిన్ ఏకైక మార్గమని వైద్యాధికారులు చెబుతుంటే.. ఓ వృద్ధురాలు మాత్రం టీకా వద్దని నానా హంగామా సృష్టించింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా మెట్​పల్లి మండలంలోని జగ్గాసాగర్ గ్రామంలో చోటుచేసుకుంది. బొర్రవ్వా అనే వృద్ధురాలు కరోనా వాక్సిన్ వేసుకోకపోవడంతో ఏఎన్ఎంలు ఆమె ఇంటికి వెళ్లారు. టీకా తీసుకుంటే కొవిడ్​ ముప్పు నుంచి తప్పించుకోవచ్చని చెప్పారు. కానీ ఆ వృద్ధురాలు తాను టీకా వేసుకోనని తెగేసి చెప్పింది. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినా.. వాక్సిన్ వేసుకోవడానికి ఆ వృద్ధురాలు ముందుకు రాలేదు.

Corona Vaccination Telangana : సుమారు రెండు గంటలపాటు ఆ వృద్ధురాలితో మాట్లాడినా ఎలాంటి లాభం లేకుండా పోయింది. ఇంట్లో ఎవరూ లేరు నేను ఒక్కదాన్నే ఉంటాను.. వ్యాక్సిన్ వేసుకుంటే ఏం జరుగుతుందో అని ఆమె భయపడింది. ఇంటికి వచ్చిన వైద్యాధికారులు వెళ్లాలని.. కాళ్లు మొక్కి వేడుకుంది. ఎంతకీ వినకపోవడం వల్ల సిబ్బంది తిరిగి వెళ్లిపోయారు. టీకా వేసేందుకు వైద్య సిబ్బందికి పలుచోట్ల ఇలాంటి ఘటనలు ఎదురవుతుండటంతో ఇబ్బందులు పడుతున్నారు.

ఇదీ చదవండి:రోడ్డుపై వధువు...ఆశావర్కర్ల ధర్నా...సినిమాకు తీసిపోని ట్విస్ట్​..!

Last Updated : Dec 9, 2021, 6:23 AM IST

ABOUT THE AUTHOR

...view details