జగిత్యాల జిల్లా తుమ్మెనాల గ్రామానికి చెందిన మామిడి రాజమల్లుకు గత నాలుగు రోజులుగా జ్వరం వస్తోంది. అతన్ని కరోనా నిర్ధరణ పరీక్ష కోసం అంబులెన్సులో ధర్మపురి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు.
పరీక్ష కోసం వచ్చి ప్రాణాలు వదిలిన వృద్ధుడు - జగిత్యాల జిల్లా లేటెస్ట్ వార్తలు
కరోనా నిర్ధరణ పరీక్ష కోసం వచ్చిన ఓ వృద్ధుడు నిలుచున్న వరుసలోనే కుప్పకూలిపోయిన ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. అతన్ని తీసుకొచ్చిన కుటుంబ సభ్యులకు పరీక్షలు చేయగా నెగెటివ్ వచ్చింది.
పరీక్ష కోసం వచ్చి ప్రాణాలు వదిలిన వృద్ధుడు
పరీక్ష కోసం వరుసలో వేచి చూస్తుండగానే రాజమల్లు కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. రాజమల్లును కరోనా పరీక్ష కోసం తీసుకువచ్చిన కుటుంబ సభ్యులు పరీక్షలు చేయించుకోగా నెగెటివ్ వచ్చింది.
ఇదీ చదవండి:ఆ రాష్ట్రాల్లో 67శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి