తెలంగాణ

telangana

ETV Bharat / state

జీవన్‌రెడ్డి నివాసం వద్ద భారీగా సంఖ్యలో కాంగ్రెస్​ శ్రేణులు - jagtial updates

కాంగ్రెస్ సీనియర్​ నేత, ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి ఇంటివద్ద కోలాహలం నెలకొంది. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్​ శ్రేణులు భారీసంఖ్యలో తరలివచ్చాయి. కార్యకర్తల నడుమ ఆయన కేక్​ కట్​ చేసి పుట్టినరోజు వేడుకను ఘనంగా జరుపుకున్నారు. పీసీసీగా బాధ్యతలు అప్పగిస్తున్నారనే సమాచారంతో పెద్దఎత్తున పార్టీ శ్రేణులు ఆయన నివాసానికి చేరుకున్నాయి.

mlc jeevan redd
కాంగ్రెస్ సీనియర్​ నేత, ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి జన్మదిన వేడుకలు

By

Published : Jan 5, 2021, 2:06 PM IST

Updated : Jan 5, 2021, 2:23 PM IST

జగిత్యాల కాంగ్రెస్​ సీనియర్​ నేత, ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి నివాసం వద్దకు పార్టీ శ్రేణులు భారీసంఖ్యలో చేరుకున్నారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని కీలక నేతలు పొన్నం ప్రభాకర్​, ఆది శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలిపారు. పీసీసీగా బాధ్యతలు అప్పగిస్తున్నారనే సమాచారంతో పార్టీ శ్రేణులు ఆయన నివాసానికి చేరుకుంటున్నట్లు భావిస్తున్నారు.

జగిత్యాలలోని ఆయన నివాసంలో అభిమానుల మధ్య పుట్టినరోజు వేడుకను ఘనంగా జరుపుకున్నారు. కేక్​ కట్ చేసి కార్యకర్తలకు పంచారు. అభిమానులు, కార్యకర్తలు పెద్దఎత్తున చేరుకుని పుష్పగుచ్చాలు అందించారు. ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత పీసీసీ ప్రకటన వెలువడే అవకాశమున్నట్లు పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

ఇదీ చూడండి:అవినీతికి కాదేదీ అనర్హం.. మీసేవల్లోనూ అక్రమం!

Last Updated : Jan 5, 2021, 2:23 PM IST

ABOUT THE AUTHOR

...view details